‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్లో హీరోయిన్ ఎవరంటే !
Published on Oct 10, 2017 9:21 am IST

తెలుగు సూపర్ హిట్ సినిమా ‘అర్జున్ రెడ్డి’ ని తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ ఇందులో హీరోగా నటించనున్నాడు. ఈ సినిమానే ధ్రువ్ డెబ్యూ సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బాల డైరెక్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని నిన్ననే విక్రమ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ క్రేజ్ నెలకొంది.

ఇలా సినిమాకి హీరో, దర్శకుడు ఇద్దరూ సెట్టైపోవడంతో హీరోయిన్ ఎవరనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఊపందుకుంది. తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు కమల్ హాసన్ కుమార్తె అక్షర హాసన్ లేదా ‘నిర్మల కాన్వెంట్’ ఫేమ్ శ్రియ శర్మల్లో ఎవరో ఒకరు కథానాయకిగా చేస్తారని వినిపిస్తోంది. మరి విక్రమ్, బాలలు హీరోయిన్ గా ఎవర్ని ఫైనల్ చేస్తారో చూడాలి.

 
Like us on Facebook