‘మెర్సల్’ రీమేక్ విషయంలో క్లారిటీ వచ్చింది !

‘మెర్సల్’ రీమేక్ విషయంలో క్లారిటీ వచ్చింది !

Published on Nov 1, 2017 4:46 PM IST

Adirindhi

సోషల్ మీడియాలో మధ్యాహ్నం నుండి తమిళ సూపర్ హిట్ సినిమా ‘మెర్సల్’ యొక్క హక్కుల్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఇక ‘మెర్సల్’ అనువాదం ‘అదిరింది’ కూడా రిలీజ్ కావడం కష్టమనే వార్తలు వినిపించాయి. దీంతో ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజముందో తెలియాలని సాయంత్రం వరకు ఎదురుచూడగా గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుండి కాస్త క్లారిటీ వచ్చింది.

అందులో అల్లు అరవింద్ రీమేక్ హక్కులు కొనడం అనేది నిజం కాదని తేలగా తమిళ సినీ వర్గాల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం డబ్బింగ్ వెర్షన్ ‘అదిరింది’ విడుదల ఆగలేదని కూడా తెలుస్తోంది. అయితే ఈ విడుదల ఎప్పుడుంటుందో మాత్రం ఇంకా తేలలేదు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ ‘అదిరింది’ ని తెలుగు ప్రేక్షకులకు సమర్పిస్తున్నారు.

తాజా వార్తలు