‘సవ్యసాచి’ చైతూ కి కేరీర్ బిగ్గెస్ట్ హిట్ అవుతుందా ?

‘సవ్యసాచి’ చైతూ కి కేరీర్ బిగ్గెస్ట్ హిట్ అవుతుందా ?

Published on Oct 30, 2018 3:43 AM IST

savyasachi sensor4
ఇటీవల ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చిన నాగ చైతన్య కు ఆ చిత్రం ఆయన అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈచిత్రం ఆతరువాత బాక్సాఫిస్ వద్ద నిలదొక్కుకోకపోవడంతో యావరేజ్ చిత్రంగానే మిగిలిపోవాల్సి వచ్చింది.

ఇక ఇప్పుడు చైతూ మరో చిత్రం తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం సవ్యసాచి. ఈ చిత్రం ఫై చైతూ చాల ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఎలాగైనా కెరీర్ బెస్ట్ చిత్రంగా నిలిచిపోతుందని ఆయన కాన్ఫిడెంట్ గా వున్నాడు.

ఇక ఇటీవల విడుదలైన టీజర్ , ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 23కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. మరి చైతూ అనుకున్న విజయం దక్కాలంటే ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను సాదించాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 2న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు