సర్కార్ రన్ టైం లాక్ !

Published on Oct 29, 2018 8:44 pm IST


ఇళయదళపతి విజయ్ నటించిన ‘సర్కార్’. చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ చిత్రం 164నిమిషాల నిడివి తో ప్రేక్షకులముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 2500 స్క్రీన్స్ లో విడుదలవుతుండగా విజయ్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న చిత్రం కూడా ఇదే కావడం విశేషం.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించింది. ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇక ఈచిత్రం తెలుగులో 750స్క్రీన్ లలో విడుదలకానుంది. దీపావళి కానుకగా నవంబర్ 6న రెండు భాషల్లో ఒకేసారి విడుదలకానుంది ఈ చిత్రం.

సంబంధిత సమాచారం :