ఉపేంద్ర “ఐ లవ్ యూ” అంటూ వచ్చేది అప్పుడే…!

Published on Jun 7, 2019 2:13 pm IST

కన్నడ సూపర్ స్టార్ ఊపేంద్ర సామజిక అంశాలపై సెటైరికల్ గా చిత్రాలు చేస్తుంటారు. ఉపేంద్ర, ఓం, ఏ, సూపర్ వంటి విలక్షణ చిత్రాలతో ఆయన ఓ ప్రత్యేకమైన నటుడిగా ఎదిగారు. ఒకప్పుడు ఉపేంద్ర కి తెలుగులో మంచి మార్కెట్ ఉండేది. ఒక వర్గం ప్రేక్షకులు ఆయన సినిమాలంటే పడిచచ్చేవారు. ఇప్పటికీ ఆయన సినిమాలను ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు.

తాజాగా ఆయన “ఐ లవ్ యూ” అనే ఓ రొమాంటిక్ మూవీతో తెలుగు ప్రేక్షకులను చాలాకాలం తరువాత పలకరించనున్నారు. వైజాగ్ లో ఈనెల తెలుగు పాటల వేడుక నిర్వహించి, జూన్ 14న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

కన్నడలో వరుసగా భారీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ చంద్రు ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఉపేంద్ర కెరీర్ లోనే గ్రాండ్ గా తెలుగులో ఈ మూవీ ని విడుదల చేయనున్నారని సమాచారం.ఈ సినిమాలో ఉపేంద్ర అద్భుతమైన పాటలకు డ్యాన్సులు ఇరగదీయడం విశేషం. ఉపేంద్ర సరసన స్టార్ హీరోయిన్ డింపుల్ క్వీన్ రచిత రామ్ హీరోయిన్ గా నటించగా కిరణ్ తోటంబలై స్వరాలు సమకూర్చారు.

దర్శకుడు ఆర్ చంద్రు స్వయంగా నిర్మించి విడుదల చేస్తున్నారు. కొంచెం బోల్డ్ సీన్స్ తో తెరకెక్కిన ఈ మూవీలో బ్రహ్మానందం కామెడీ మరో హైలెట్ అవుతుందని అంటున్నారు. సోను గౌడ, హోనవళ్ళి కృష్ణ, జై జగదీష్‌, పీడీ సతీష్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :

More