అప్పుడు అల్లు అర్జున్‌తో… ఇప్పుడు వరుణ్ తేజ్‌తో

Published on Sep 18, 2020 5:31 pm IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నారు. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేయనున్న ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరిలోనే మొదలుకాగా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. లాంగ్ గ్యాప్ తర్వాత త్వరలో మళ్లీ ఆరంభంకానుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఉండనున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీ రోల్ చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే వరుణ్ తేజ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈరోజు ఉపేంద్ర పుట్టినరోజు కావడంతో ఈ అప్డేట్ ఇచ్చారు బృందం. కన్నడ పరిశ్రమలో ఉపేంద్రది సూపర్ స్టార్ లెవల్. అలాంటి ఆయన వరుణ్ తేజ్ సినిమాకు ఒప్పుకున్నారంటే కథలో, తన పాత్రలో ఎంతో బలం ఉండబట్టే ఒప్పుకుని ఉండాలి.

ఉపేంద్ర గతంలో అల్లు అర్జున్‌తో కలిసి ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రంలో నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అందులో దేవరాజ్ పాత్రలో ఉపేంద్ర నటనకు మంచి పేరొచ్చింది. 2015లో వచ్చిన ఆ సినిమా తర్వాత తెలుగు నుండీ ఉపేంద్రకు చాలానే ఆఫర్లు వెళ్లాయి. కానీ ఆయన వేటికీ ఒప్పుకోలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన్ను ఎవరూ మెప్పించలేకపోయారు. మళ్లీ ఇన్నేళ్లకు వరుణ్ చిత్రానికి సైన్ చేశారు.

దీంతో సినిమాలో ఆయన పాత్రపై ఇప్పటి నుండే అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రం కోసం వరుణ్ బరువు తగ్గి కొత్త మేకోవర్ చేసుకోవడమే కాకుండా విదేశాలకు వెళ్ళి కొన్ని నెలల పాటు బాక్సింగ్ శిక్షణ కూడ తీసుకున్నారు. ఇకపోతే మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిచనున్నారు.

సంబంధిత సమాచారం :

More