డెబ్యూ మూవీ అయినా మెగా హీరో తగ్గడం లేదుగా..!

Published on Jul 7, 2020 10:15 am IST

మెగా కాంపౌండ్ నుండి ఎంట్రీ ఇస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. ఆయన డెబ్యూ మూవీ ఉప్పెన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు సనా బుచ్చిబాబు తెరకెక్కించగా, కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ లోనే విడుదల కావాల్సివుండగా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడుతూ వస్తుంది. థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు బావిస్తున్నారు.

ఐతే రెండు తెలుగు రాష్ట్రలలో కరోనా విజృంభణ అధికంగా ఉన్న తరుణంలో ఇప్పట్లో థియేటర్స్ తెరుచుకోవడం కష్టమే అనే మాట వినిపిస్తుంది. దీనితో ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ మంచి ఫ్యాన్సీ ఆఫర్స్ తో ఉప్పెన నిర్మాతలను కలిశారు. కానీ తమ సినిమా థియేటర్ లోనే విడుదల చేస్తాం అని పట్టుబట్టి కూర్చున్నారు. ఇది వైష్ణవ్ డెబ్యూ మూవీ కావడంతో థియేటర్స్ లో విడుదల చేయాలనేది దర్శక నిర్మాతల ఆలోచన. దేవిశ్రీ సాంగ్స్ బంపర్ హిట్ కొట్టడంతో మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. మరి మెగా హీరో థియేటర్ రిలీజ్ కే కట్టుబడి ఉంటాడో లేక..ఓ టి టి లో విడుదల చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More