‘ఉప్పెన’లాంటి ప్రేమ.. హృదయాల్ని తాకుతుంది

Published on Jan 13, 2021 8:28 pm IST

ఎప్పటి నుండో ఊరిస్తూ వస్తున్న వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ టీజర్ ఈరోజే విడుదలైంది. మొదటి నుండి ఈ సినిమాపై మంచి ప్రేమ కథ, భావోద్వేగాలతో నిండి ఉంటుంది అనే ప్రచారం ఉంది. ఈరోజు విడుదలైన టీజర్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి ప్రేమించుకోవడం, వారి స్వచ్ఛమైన ప్రేమకు ఆటంకాలు కలగడం అనేది పాత ఇతివృత్తమే. కానీ దాన్ని ఎంత హృద్యంగా చెప్పారు, ప్రేక్షకుల హృదయాలకు ఎంత దగ్గర చేశారు అనేదే మ్యాజిక్.

అలాంటి మ్యాజిక్ అన్ని అండర్ డాగ్ లవ్ స్టోరీల్లోనూ కనబడదు. అలా కనిపిస్తే ఆ సినిమా హిట్టవ్వకుండా ఉండదు. ‘ఉప్పెన’ కూడ అలాంటి మ్యాజిక్ కలిగిన సినిమాలానే ఉంది. గుండెల్లో దాగున్న ‘ఉప్పెన’లాంటి స్వచ్ఛమైన ప్రేమ కథను కొత్తగా, భావోద్వేగపూరితంగా చెప్పే ప్రయత్నం చేసినట్టున్నారు దర్శకుడు బుచ్చిబాబు. ఆ ప్రయత్నమే గనుక ఫలిస్తే సినిమా ప్రేక్షకుల హృదయాల్ని తప్పకుండా తాకుతుంది. టీజర్లోని విజువల్స్, బీజీఎమ్, మాటలు చాలా ఫీల్ గుడ్ అనుభూతిని ఇచ్చాయి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించగా కృతి శెట్టి హీరోయిన్‌గా నటించడం జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలకానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More