బెల్లంకొండకు కాజల్ బాగానే యూజ్ అయిందిగా ?

Published on Apr 16, 2019 6:09 pm IST

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ‘సీత’ సినిమా ఈ నెల నాలుగో వారంలో రాబోతున్న విషయం తెలిసిందే. ఎప్పటినుంచో ఓ భారీ హిట్ కోసం బాక్సాఫీస్ వద్ద పడి గాపులు కాస్తోన్న బెల్లంకొండకు కనీసం ‘సీత’ అయినా హిట్ ఇస్తోందో లేదో చూడాలి.

అయితే ‘సీత’కు బిజినెస్ బాగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క సూపర్ హిట్ కూడా లేని హీరోకు 18 కోట్లు పైగానే బిజినెస్ జరుగుతుందంటే దానికి కారణం.. కేవలం హీరోయిన్ కాజల్.. దర్శకుడు తేజానే అని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బెల్లంకొండకు కాజల్ బాగానే యూజ్ అయింది.

ఇక ఈ చిత్రం తేజ దర్శకత్వ శైలిలోనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మరియు మంచి భావోద్వేగ సన్నివేశాలతో ఈ సినిమా సాగుతుందని సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ చిత్రంలో కొత్తగా కనిపించనున్నాడట. ఇక ఈ సినిమాలో సోనూసూద్ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More