పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలు ఆల్రెడీ ఈ ఏడాది వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాల తర్వాత పవన్ చేస్తున్న అవైటెడ్ సినిమానే “ఉస్తాద్ భగత్ సింగ్”. తన ఫ్యాన్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా దేఖేలేంగే సాలా అంటూ వచ్చిన సాంగ్ మాత్రం ఇప్పుడు ఫ్యాన్స్ కి ఒక ఊహించని ట్రీట్ అని చెప్పాలి.
దేవిశ్రీ ప్రసాద్ ఎప్పటిలానే మంచి సంగీతం అందించారు కానీ ఇందులో డామినేట్ చేసింది మాత్రం పవర్ స్టార్ ఎనర్జీనే అని చెప్పాలి. ఇలాంటి పవన్ కళ్యాణ్ ని కూడా ఫ్యాన్స్ కి ఎన్నో ఏళ్ళు అయ్యి ఉండొచ్చు. ఓజి సినిమాలో వింటేజ్ పవర్ స్టార్ యాక్షన్ కనిపిస్తే ఈ సాంగ్ చూసాక మాత్రం సాంగ్స్ పరంగా పవన్ లోనూ మంచి స్వాగ్ తో కూడిన ఎనర్జిటిక్ పర్సనాలిటీ ఉన్నాడని మళ్ళీ గుర్తు చేసే విధంగా ఉంది.
డెఫినెట్ గా ఈ సాంగ్ కి థియేటర్స్ లో దద్దరిల్లే రెస్పాన్స్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాంగ్ లో డాన్స్ కొరియోగ్రఫీ కానీ సాహిత్యం, సెట్ వర్క్స్ అంతా బాగున్నాయి. ఇక శ్రీలీల కూడా పవన్ తో స్టెప్పేయడం విశేషం. సో ఫ్యాన్స్ ఈ సాంగ్ ని గట్టిగానే ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది సినిమాని రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.


