పవన్ లేకుండానే “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ షురూ!

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో అనేక సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ఈ నెల 7న ప్రారంభమైంది. పవన్ సినిమా కోసం రెండు రోజులు షూట్ చేసి తర్వాత సడెన్ గా విజయవాడ వెళ్లిపోయాడు. ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పవన్ మరికొన్ని రోజులు అక్కడే ఉండనున్నట్లు సమాచారం.

కానీ యూనిట్ నుండి వచ్చిన వార్త ఏమిటంటే, పవన్ కళ్యాణ్ లేకపోయినా, మేకర్స్ షూటింగ్ కి అన్నీ రకాలుగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇతర నటీనటులతో షూట్‌లను ప్లాన్ చేశారు మేకర్స్. మరికొందరు కీలక పాత్రధారులతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చాలా గ్యాప్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి డీఎస్పీ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version