మార్చి 1న ‘ఉత్తమ విలన్’ ఆడియో.

మార్చి 1న ‘ఉత్తమ విలన్’ ఆడియో.

Published on Feb 1, 2015 3:04 AM IST

Uttama-Villain
విశ్వ నటుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన తాజా సినిమా ‘ఉత్తమ విలన్’. ఈ సినిమా ఆడియోను మార్చి 1వ తేదిన విడుదల చేస్తున్నట్టు నిర్మాత లింగుస్వామి సోషల్ మీడియాలో తెలిపారు. ‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సంగీత దర్శకుడు జిబ్రాన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. ‘ఉత్తమ విలన్’ కాకుండా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న మరో రెండు కమల్ హాసన్ సినిమాలు ‘విశ్వరూపం 2’, ‘పాప నాశనం’ సినిమాలకు కూడా జిబ్రాన్ సంగీతం అందిస్తుండడం విశేషం.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్నాయి. ఆస్కార్ నామినేటెడ్ సౌండ్ డిజైనర్ క్రైగ్ మాన్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. నటుడు రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా కుమార్, ఆండ్రియాలు హీరోయిన్లుగా నటించారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలను కమల్ అందించారు. స్వర్గీయ బాలచందర్, కె.విశ్వనాధ్, జయరాం, ఉర్వశి తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, లింగుస్వామి తిరుపతి బ్రదర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు