నాని-సుధీర్ కి మధ్య ఇగో వార్.. !

Published on Feb 18, 2020 8:02 am IST

నాని తన 25వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వి’ మూవీ నాని గత చిత్రాలకు మించి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. చిత్ర షూటింగ్ సైతం మలేసియా, మనాలి వంటి ప్రదేశాలలో నిర్వహించారు. ఈ చిత్రం పై అంచనాలు భారీ స్థాయిలో ఉండగా, నిన్న టీజర్ విడుదల తరువాత తారాస్థాయికి చేరాయి.

సీరియస్ పోలీస్ అధికారికి, డేంజర్ కిల్లర్ కి మధ్య నడిచే థ్రిల్లింగ్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తుంది. సెన్సిబుల్ సీరియస్ పోలీస్ సుధీర్ కి సీరియల్ కిల్లర్ నాని విసిరే ఛాలెంజ్ లు, వీరి మధ్య నడిచే ఇగో వార్ ప్రధానం ఈ చిత్రం తెరకెక్కింది. ఇక వీరి మధ్య ఛేజింగ్స్ మరియు ఫైటింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తుంది. మొత్తానికి నాని వి సరికొత్తగా ఉంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అమిత్ త్రివేది సంగీతం అందించారు. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More