‘పహిల్వాన్’ మరో ‘కె.జి.ఎఫ్’ అవుతుందా ?

Published on Aug 29, 2019 1:21 am IST

‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ప‌హిల్వాన్‌. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నారు. ఈ యాక్ష‌న్ డ్రామాలో సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 12న ఈ చిత్రాన్ని విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమా పై సౌత్ అన్ని భాషల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఇటీవలే విడుదలైన పహిల్వాన్ ట్రైలర్, సినిమా పై భారీగా అంచనాలను పెంచేసింది. ట్రైలర్ చూస్తే ఒక కుస్తీ వీరుడు బాక్సింగ్ రింగ్ లో దిగితే ఎలా ఉంటుందనేది ఈ చిత్రం. ఇక సీనియర్ బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి సుదీప్ గురువుగా కనిపిస్తున్నారు.

ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టితో పాటు ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ సినిమాకు క‌రుణాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ప‌హిల్వాన్‌ చిత్రంతో కూడా మరో విజయాన్ని అందుకుంటామని నమ్మకంగా చెబుతుంది ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారాహి వారాహి సంస్థ. ఇప్పటికే కన్నడ చిత్రం ‘కె.జి.ఎఫ్’ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు ప‌హిల్వాన్‌ సినిమాని కూడా రిలీజ్ చేయబోతుంది వారాహి సంస్థ. మరి ‘కె.జి.ఎఫ్’లాగే ‘పహిల్వాన్’ కూడా సక్సెస్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :