కంటిన్యూ అవుతున్న ‘వాతి కమింగ్’ సెన్సేషన్.!

Published on May 1, 2021 5:30 pm IST

ఇళయ థలపతి విజయ్ హీరోగా మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్”. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఈ చిత్రానికి లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వం వహించారు. అయితే విడుదల కాబట్టి అన్ని చోట్లా హిట్ టాక్ ఈ చిత్రం తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాకు అంత హైప్ రావడానికి కారణం అనిరుద్ సంగీతం అని కూడా తెలిసిందే.

ముఖ్యంగా ఈ సినిమాలో అనిరుద్ ఇచ్చిన బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ “వాతి కమింగ్” సెన్సేషన్ ఇంకా కొనసాగుతూ వస్తుంది. అప్పుడు ఎలా అయితే లిరికల్ సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ కు కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ సాంగ్ ఆల్రెడీ 150 మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్ చెయ్యగా ఇప్పుడు ఇదే వీడియో సాంగ్ 2 మిలియన్ లైక్స్ టచ్ చేసి మరో సరికొత్త రికార్డు అందుకుంది. మొత్తానికి మాత్రం ఈ సాంగ్ సెన్సేషన్ అప్పుడే ఆగేలా లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :