మన టాలీవుడ్ సినిమా దగ్గర ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ మార్కెట్ ని ఎంతగానో అలరించిన అతి కొద్ది మంది హీరోస్ లో వడ్డే నవీన్ కూడా ఒకరు. అయితే ఎన్నో ఏళ్ల కితం సినిమాలకు దూరం అయ్యిన తను మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కంబ్యాక్ ఇస్తూ చేసిన లేటెస్ట్ సినిమానే “ట్రాస్ఫర్ త్రిమూర్తులు”. తనే నిర్మాతగా రాశి సింగ్ హీరోయిన్ గా దర్శకుడు కమల్ తేజ తెరకెక్కించిన ఈ సినిమా కొన్ని వారాల కితమే విడుదల అయ్యింది.
అయితే కంటెంట్ ప్లానింగ్ సరిగా సినిమా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న వడ్డే నవీన్ సినిమా ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఈ సినిమా హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 వారు సొంతం చేసుకున్నారు. ఇక అందులో ఈ జూలై 17 నుంచి సినిమా అందుబాటులోకి రానుంది. సో అప్పుడు మిస్ అయినవారు ఉంటే ఇంకొన్ని రోజుల్లో చూడొచ్చు.


