మెగా హీరో ఫస్ట్ లుక్ రేపే

Published on Jan 22, 2020 8:00 pm IST

మెగా ఫ్యామిలీ నుండి త్వరలో ఇంకో హీరో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అతనే సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్. సుకుమార్ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వైష్ణవ్ సినిమా చేస్తున్నాడు. ఇందులో అతనొక జాలరి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు ‘ఉప్పెన’ అనే టైటిల్ నిర్ణయించారు.

సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే టైటిల్ లోగో రిలీజ్ చేసిన టీమ్ రేపు 23వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు ఫస్ట్ లుక్ విడుదలచేయనున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఇందులో ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More