వెండితెర పై వకీల్ సాబ్ కుమ్మేశాడు…మరో రికార్డు సెట్ చేశాడు!

Published on Jul 23, 2021 12:49 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ చిత్రం థియేటర్ల లో విడుదల అయి సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. పవర్ కళ్యాణ్ చిత్రం పాన్ ఇండియా చిత్రం కాకపోయిప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ చిత్రం వసూళ్ల కి సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టిన చిత్రాల్లో వకీల్ సాబ్ 64 వ స్థానం లో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇండియా లో మొదటగా 45 వ స్థానం లో విజయ్ మాస్టర్ చిత్రం ఉండగా, తర్వాత వకీల్ సాబ్ ఉండటం విశేషం. అయితే టాలీవుడ్ నుండి మరొక చిత్రం అయిన ఉప్పెన 66 వ స్థానం లో ఉండటం గమనార్హం. జాతి రత్నాలు 69, క్రాక్ 70 స్థానాల్లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ న్యాయవాది గా నటించిన వకీల్ సాబ్ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా సంగీతం తమన్ అందించారు.

సంబంధిత సమాచారం :