3 కోట్ల వ్యూస్ తో “వకీల్ సాబ్”..!

Published on Sep 23, 2020 4:25 pm IST

దాదాపు రెండున్నరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ చిత్రం పింక్ కు రీమేక్ గా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఆడవారికి ఒక ప్రత్యేకమైన సినిమా అని అందరికీ తెలిసిందే. అందుకే ఈ చిత్రం మేకర్స్ కూడా వారి కోసమే స్పెషల్ ప్లానింగ్స్ చేసారు.

అలా చేసిన పాటే “మగువ మగువ”. ఈ ఏడాది ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా విడుదల చేసిన ఈ లిరికల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ మరియు లైక్స్ పరంగా మంచి రెస్పాన్స్ ను అందుకున్న ఈ లిరికల్ వీడియోకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా థమన్ సంగీతం అందించారు.

లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ సిద్ శ్రీరాం పాడిన ఈ పాట ఇపుడు 30 మిలియన్ మార్క్ ను అందుకుంది. ఇలా కేవలం మూడు కోట్ల వ్యూస్ తూ పాటుగా 6 లక్షల 86 వేల లైక్స్ ను అందుకుని పవన్ కెరీర్ లోనే అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ అందుకున్న సాంగ్ గా నిలిచింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇపుడు బ్యాలన్స్ షూట్ ను కంప్లీట్ చేసుకుంటుండగా మేకర్స్ ఈ చిత్రాన్ని సంక్రాంతి రేస్ లో నిలిపే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More