“వకీల్ సాబ్” హైప్ అక్కడే వేరే లెవెల్లోకి వెళ్తుందా?

Published on Mar 18, 2021 10:59 am IST

ఓ స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే ఆ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి అలాంటి స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఇప్పుడు పవన్ నటించిన లేటెస్ట్ చిత్రం అందులోని తన కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్” కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం కరోనా వల్ల ఇప్పటికి షిఫ్ట్ అయ్యింది.

కానీ పవన్ కంబ్యాక్ సినిమా అయిన దీనికి అనుకున్న స్థాయి ప్రమోషన్స్ లేకపోవడం వల్ల అనుకున్న స్థాయి హైప్ ఇంకా రాలేదు అన్నది పవన్ అభిమానుల మదిలో ఉన్న మాట కూడా.. కానీ మేకర్స్ ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు. కానీ వకీల్ సాబ్ కు అసలు హైప్ అంతా ఈ చిత్రం తాలూకా ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే వేరే లెవెల్ కు వెళ్తుంది అని సినీ వర్గాలు చెబుతున్నాయి.

పవన్ కెరీర్ లోనే నెవర్ బిఫోర్ గా ఈ ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి దిల్ రాజు మాత్రం అప్పటికి గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించాడు.శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అంజలి మరియు నివేతా థామస్ లు కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏప్రిల్ 9న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :