పవన్ ఫ్యాన్స్ కే ఎందుకిలా..?

Published on Mar 29, 2020 1:30 am IST

కరోనా వైరస్ కారణంగా సినీ పరిశ్రమ తాత్కాలికంగా మూతపడిన నేపథ్యంలో మూవీ లవర్స్ కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణ పరిస్థితులు ఏర్పడి త్వరలో కొత్త సినిమాల విడుదల జరగాలని వారు కోరుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ ని వెండితెరపై చూసి రెండేళ్లు దాటిపోతుంది.పాలిటిక్స్ కొరకు సినిమాలనుండి బ్రేక్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చారు.

ఆయన నటించిన వకీల్ సాబ్ మరో రెండు నెలల్లో విడుదల కావాల్సివుంది. మే నెలలో ఈ మూవీ విడుదల కావాల్సివుంది. కరోనా ఎఫెక్ట్ తో వకీల్ సాబ్ షూటింగ్ చివర్లో వాయిదాపడింది. దీనితో మే నెలలో ఈ చిత్రం విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదు. కొద్దిరోజులలో తమ అభిమాన హీరోని వెండితెరపై చూస్తాం అని సంబరపడ్డ ఫ్యాన్స్ ఇంకొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా పవన్ అరుదుగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని నిరీక్షించేలా చేస్తాడు. ఈసారి ఆయన వరుసగా మూడు సినిమాలు ప్రకటించినా, కరోనా రూపంలో వకీల్ సాబ్ విడుదలకు అడ్డుకట్ట పడింది.

సంబంధిత సమాచారం :

X
More