హోరెత్తిస్తున్న “వకీల్ సాబ్” ప్రమోషన్స్.!

Published on Mar 20, 2021 12:01 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం పూర్తయ్యి చాలా కాలం అయ్యింది. మరి ఇప్పుడు ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా ప్రమోషన్స్ ను గట్టిగానే ప్లాన్ చేశారు.

ఈ మార్చ్ నేలను మ్యూజికల్ మార్చ్ అని స్టార్ట్ చేసినా అదే సరిపోలేదని భావన పవన్ అభిమానులలో కలిగింది. దీనితో నిన్నటి నుంచి ఆఫ్ లైన్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసేసారు. మరి ఈరోజు మేకర్స్ దుండిగల్ ఎంఎల్ఆర్ఐటి కాలేజ్ లో మ్యూజిక్ ఫస్ట్ ను ప్లాన్ చేసి మరింత రీచ్ సెట్ చేసారు.

ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇది స్టార్ట్ కానుంది. ఇందులో సంగీత దర్శకుడు థమన్ మరియు దర్శకుడు వేణు శ్రీరామ్ లు పాల్గొననున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి నిర్మాత దిల్ రాజు వచ్చే ఏప్రిల్ 9 సినిమా రిలీజ్ టైం కి గట్టి ప్లానింగ్స్ లోనే ఉన్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :