పవన్ ఫ్యాన్స్ కు “వకీల్ సాబ్” టీజర్ ఓ బ్లాస్ట్ గా నిలవనుందా?

Published on Jan 14, 2021 3:30 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రం కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే అంతకు ముందే వస్తున్న టీజర్ పండుగను మాత్రం ఓ రేంజ్ లో చెయ్యాలని గట్టిగా ఫిక్స్ అయ్యిపోయారు.

అంతే కాకుండా యూట్యూబ్ వ్యూస్ పరంగా కూడా భారీ రికార్డులనే సెట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ టీజర్ కు సంబంధించి మరిన్ని ఆసక్తికర వార్తలే వినిపిస్తున్నాయి. ఈ టీజర్ లో ఇప్పటికే పవన్ ఒక పంచ్ డైలాగ్ తో అదరగొట్టనున్న సంగతి తెలిసిందే.

మరి అలాగే మరో టాక్ ఏంటి అంటే ఇన్నేళ్లు నిరీక్షణతో ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్ కోసమే స్పెషల్ గా కట్ చేశారట. మొత్తం పవన్ అభిమానులకు ఈ టీజర్ ఒక పెద్ద ట్రీట్ గా నిలుస్తుంది అని తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఈ టీజర్ కోసం పవన్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు.

మరి ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల కాబోయే ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాకు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More