ఓవర్సీస్లో ‘వకీల్ సాబ్’ దున్నేశాడు

ఓవర్సీస్లో ‘వకీల్ సాబ్’ దున్నేశాడు

Published on Apr 10, 2021 12:25 AM IST

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మేనియా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లో కూడ స్పష్టంగా కనబడింది. లాక్ డౌన్ తర్వాత యూఎస్ఏలో తెలుగు సినిమాలు గొప్ప పెర్ఫార్మెన్స్ చూపింది లేదు. ఒక్క ‘జాతిరత్నాలు’ మినహా మిగతా సినిమాలన్నీ ప్రభావం చూపలేకపోయాయి. కోవిడ్ కారణాల రీత్యా అమెరికాలోని తెలుగువారు థియేటర్లకు వస్తారా రారా అనే అనుమానం కలిగింది. హక్కులేమో దాదాపు 5 కోట్ల పెద్ద మొత్తానికి అమ్ముడయ్యాయి. ఈ మొత్తం వెనక్కి రావాలంటే మొదటిరోజు సాలిడ్ ఓపెనింగ్స్ రావాలి.

పవన్ మేనియాతో ‘వకీల్ సాబ్’ ప్రీమియర్ల ద్వారా మంచి వసూళ్లు సాధించింది. మొత్తం 226 లొకేషన్లలో 296,885 డాలర్లను వసూలు చేసింది. లాక్ డౌన్ తర్వాత అందులోనూ కరోనా కల్లోలంలో ఈ స్థాయి వసూళ్లు సాధించిన మొదటి ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. ఈ జోరులోనే వసూళ్లు కొనసాగితే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. అమెరికాలోనే కాదు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కూడ ‘వకీల్ సాబ్’ ప్రభావం కనబడుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు