ఈ రేస్ లో “వకీల్ సాబ్” ఆగమనం.?

Published on Dec 2, 2020 1:01 pm IST

దాదాపు రెండున్నరేళ్లు తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టేకప్ చేసిన చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా పవన్ కం బ్యాక్ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ఏడాది వేసవిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వల్ల వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యిపోయింది.

అయితే ఇంకా కొంత మేర షూటింగ్ ను మిగుల్చుకొని ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో విడుదల కాబోతుంది అని టాక్ వచ్చింది. కానీ షూటింగ్ కు మళ్ళీ బ్రేక్ రావడంతో ఆ రేస్ నుంచి ఈ చిత్రం తప్పుకున్నట్టు అయ్యింది. అయితే ఇప్పుడు ఈ పండగ సీజన్ ను దాటి ఈ చిత్రం ఆ తర్వాత పండగ రేస్ ఉగాదిలో ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

అలాగే ఈ విషయం పైనే మేకర్స్ ఒక అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనితో వకీల్ సాబ్ ఆగమనం అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యిందని చెప్పాలి. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More