అజిత్ “వలిమై” ఫస్ట్ సింగిల్ సెన్సేషన్..!

Published on Aug 3, 2021 11:52 am IST


హెచ్. వినోద్ దర్శకత్వం లో అజిత్ కుమార్ హీరోగా, కార్తికేయ, హుమ ఖురేషీ, బని, సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగి బాబు, రాజ్ అయ్యప్ప, పుగజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వలిమై. ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే విడుదల అయి సెన్సేషన్ సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదల అయ్యింది. అయితే ఈ నాంగ వేర మారి లిరికల్ సాంగ్ కి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది.

అయితే ఈ పాట కి విఘ్నేష్ శివన్ లిరిక్స్ అందించగా, యువన్ శంకర్ రాజా, అనురాగ్ కులకర్ణి స్వరపరిచారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫస్ట్ సింగిల్ విడుదల అయిన 12 గంటల్లోనే 5 మిలియన్ కి పైగా వ్యూస్ సొంతం చేసుకోగా, 850 కే లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :