రీ ఎంట్రీ ఇవ్వనున్న అలనాటి హీరోయిన్ !
Published on Mar 8, 2017 8:40 am IST


మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రాలైన ‘కొదమ సింహం, ఘరానా మొగుడు’ వంటి వాటిలో నటించి మంచి గుర్తింపు పొందిన నటి వాణీ విశ్వనాథ్ లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యింది. దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో వాణీ విశ్వనాథ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ పాత్ర ఎలా ఉంటుంది అనే సంగతి మాత్రం బయటకు రాలేదు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. గత కొన్నాళ్లుగా కెరీర్లో బలమైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న హీరో శ్రీనివాస్ ఈ చిత్రంతో విజయం సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు.

 
Like us on Facebook