తెలుగు హీరోతో ‘వరలక్ష్మీ శరత్‌కుమార్‌’.. ?

Published on Nov 14, 2019 1:30 am IST

‘వరలక్ష్మీ శరత్‌కుమార్‌’కి హీరోయిన్ కు ఉండాల్సిన క్యాలిటీస్ అన్ని ఉన్నా ఎందుకో హీరోయిన్ గా మాత్రం బిజీ కాలేకపోతుంది. ఇండస్ట్రీ నుండి స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నా.. ఇన్నాళ్లూ ఎక్కువుగా సేడ్ క్యారెక్టర్స్ కే పరిమితం అయింది. పోనీ ఆ క్యారెక్టర్స్ అయినా, ప్రాముఖ్యత ఉన్న పాత్రలా అంటే.. ఎదో చిన్న చితక చిత్రాల్లో రెగ్యూలర్ క్యారెక్టర్స్. అయితే తాజాగా వరలక్ష్మికి ఓ మంచి క్యారెక్టర్ దొరికింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం మాస్‌ మహారాజా సినిమాలో ఆమె ముఖ్య పాత్రలో కనిపించనుంది.

ర‌వితేజ హీరోగా క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ మూవీ ర‌వితేజ 66వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. ఆమె పాత్ర కూడా శ్రుతి హాసన్ పాత్రకు తగ్గట్లే ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ర‌వితేజ ప‌వ‌ర్‌ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ గా నటించనున్నాడు. బి.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ‘వరలక్ష్మీ శరత్‌కుమార్‌’ తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. సందీప్‌ కిషన్‌, హన్సిక ప్రధాన పాత్రల్లో కనిపించే ఈ చిత్రానికి నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :

More