‘బాలయ్య’కి విలన్ గా హీరో కుమార్తె !

Published on May 10, 2019 12:00 am IST

దర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో న‌ట‌సింహ నందమూరి బాల‌కృష్ణ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో లేడీ విలన్ గా ఓ హీరోయిన్ నటించబోతుంది. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి ఈ చిత్రంలో విలన్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు కూడా ఈ చిత్రంలో పవర్ ఫుల్ విల‌న్‌ గా న‌టించ‌బోతున్నారు. బ్లాక్‌బ‌స్ట‌ర్ `లెజెండ్‌` త‌ర్వాత బాల‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో ఈ చిత్రం రూపొంద‌నుంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు.

ప్ర‌ముఖ నిర్మాత, సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. `జైసింహా` వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌ లో రూపొంద‌నున్న చిత్ర‌మిది. మే 17న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అవుతుంది. అలాగే జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

సంబంధిత సమాచారం :

More