జార్జ్ రెడ్డి తో వర్మ సంచలన చిత్రం…!

Published on Nov 19, 2019 8:21 am IST

రామ్ గోపాల్ వర్మ వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ఓ షార్ట్ ఫిల్మ్ తీసినంత ఈజీగా వర్మ ఓ మూవీ ముగించేస్తారు. బాలీవుడ్ స్టార్ హీరోలతో కూడా ఈయన అలాగే అతితక్కువ కాలంలో తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసేవారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ వివాదమే పెట్టు పడిగా, విమర్శలే ప్రచారంగా వాడుకుంటూ ఆ తరహా సినిమాలు తీస్తూ ముందుకెళుతున్నారు. ఐతే జార్జ్ రెడ్డి చిత్రంలో హీరోగా నటించిన సందీప్ మాధవ్ హీరోగా ఓ సంచల చిత్రం చేస్తున్నట్లు వర్మ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టుల సినిమాలు తీసిన నేను…హైదరాబాద్ దాదాలపై సినిమా తీస్తున్నాను. 80ల కాలంనాటి హైదరాబాద్ దాదాలపై సినిమా చేస్తున్నాను. శివ సినిమా లాగా ఈ చిత్రాన్ని కూడా కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఆధారంగా తెరకెక్కిస్తాను, సందీప్ మాధవ్ ఇప్పుడే ఈ సినిమాలో నటించడానికి సైన్ చేశాడు… అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఆంధ్రాలో ఫ్యాక్షనిస్టుల నుండి గుండాల వరకు ఎవరినీ వదలని వర్మ హైదరాబాద్ దాదాలంటూ ఎవరిని గెలకనున్నాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More