పవర్ స్టార్ పోస్టర్ తో వివాదం రాజేస్తున్న వర్మ.

Published on Jul 9, 2020 8:42 am IST

రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కేవలం కాంట్రవర్సీ, అడల్ట్ కంటెంట్ నమ్ముకొని సినిమాలు తీస్తున్నారు. ఆయన ఆర్ జి వి వరల్డ్ థియేటర్ ఐడియా సూపర్ సక్సెస్ కావడంతో పాటు ఆయనకు కాసులు కురిపిస్తుంది. దీనితో ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. కొద్దిరోజుల వ్యవధిలో క్లైమాక్స్, నగ్నం చిత్రాలు విడుదల చేసిన వర్మ మరో నాలుగు ప్రాజెక్ట్స్ ప్రకటించారు. అందులో పవర్ స్టార్ ఒకటి.

పవర్ స్టార్ ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసిన వర్మ అందులో అభ్యంతరకర అంశాలు పొందుపరిచారు. పవర్ స్టార్ టైటిల్ లోగోలో టీ గ్లాసు ఉండడం విశేషం. ఇది ఓ వర్గానికి బాగా కోపం తెప్పించే విషయమే. ఇక నేడు ఉదయం 11: 37 నిమిషాలకు పవర్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :

More