గెలిచినోళ్ళకి ఓడినోళ్లు శుభాకాంక్షలు తెలపడమేంటి…?నాన్సెన్స్ అంటున్న వర్మ.

Published on May 25, 2019 12:08 pm IST

ఎన్నికల ఫలితాలు వెలివడినప్పటినుండి సీరియస్ ట్విట్టర్ కామెంట్స్ చేస్తున్న వర్మ నేడు రాజకీయ పరిణామాలపై మరో ఆసక్తికర ట్వీట్ చేసి మరో మారు వార్తలలో నిలిచారు. “ఎన్నికలలో గెలిచినవారికి ఓడినవారు శుభాకాంక్షలు తెలపడం సిగ్గుమాలిన చర్య. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులపై అవినీతి,నేరారోపణలు చేసిన వారు, వారి ఆరోపణలకు కట్టుబడినవారైతే, ప్రత్యర్థుల విజయానికి, బాధ, కోపాన్ని ప్రదర్శించాలి కానీ శుభాకాంక్షలు చెప్పరాదు” అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు.

మనసులో ఎంటువంటి భావన ఉన్నాకాని గెలిచిన వారికి విషెస్ చెప్పడం చిన్న కామన్ సెన్స్, ఇందులో కూడా వివాదం వెతుకున్న వర్మ ను చూస్తుంటే ఆయనకే ఎందుకిలాంటి ఐడియాలొస్తాయి?… అని అనిపించక మానదు.

సంబంధిత సమాచారం :

More