తమన్ మ్యూజిక్ డైరెక్షన్.. “దిగు దిగు నాగ” ఫోక్ సాంగ్ అదిరిందిగా..!

Published on Aug 2, 2021 9:30 pm IST

యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం “వరుడు కావలెను”. ఈ చిత్రంలో మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్ష వర్ధన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూరై ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టిన చిత్ర యూనిట్ ఇటీవల ఓ గ్లిమ్స్ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి “దిగు దిగు నాగ” అనే పాట ప్రోమో విడుదలయ్యింది. తమన్ మ్యూజిక్ డైరెక్ట్ చేసిన ఈ పాటలో రీతూ అదరగొట్టినట్టు అనిపిస్తుంది. అయితే ఈ పాటకు సంబంధించి పూర్తి లిరికల్ వీడియోను ఆగష్టు 4వ తేదిన విడుదల చేయబోతున్నట్టు ప్రోమోలో తెలిపారు. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా, శ్రేయా గోషల్ ఆలపించింది. పీడీవీ ప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :