ఓటిటి సమీక్ష : వరుణ్ సందేశ్ “చిత్రం చూడర” – ఈటీవీ విన్ లో ప్రసారం

ఓటిటి సమీక్ష : వరుణ్ సందేశ్ “చిత్రం చూడర” – ఈటీవీ విన్ లో ప్రసారం

Published on May 11, 2024 1:05 PM IST
Chithram Chudara Movie Review in Telugu

విడుదల తేదీ : మే 10, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

నటీనటులు: వరుణ్ సందేశ్, శీతల్ భట్, ధనరాజ్, శివాజీ రాజా, కాశీ విశ్వనాథ్, రవిబాబు

దర్శకుడు: ఆర్ ఎన్ హర్షవర్ధన్

నిర్మాతలు: బోయపాటి భాగ్యలక్ష్మి, శేషు మారంరెడ్డి

సంగీత దర్శకుడు: రధన్

సినిమాటోగ్రఫీ: జవహర్ రెడ్డి

ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ వారం థియేటర్స్ సహా ఓటిటిలో కూడా పలు చిత్రాలు రిలీజ్ కి వచ్చాయి. మరి ఈ చిత్రాల్లో ప్రముఖ నటుడు వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రం “చిత్రం చూడర” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఓటిటి యాప్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ వచ్చింది. ఇక, ఎంతమేర ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం రండి.

కథ :

ఇక కథ లోకి వస్తే.. మల్లేశం (శివాజీ రాజా) సినీ పరిశ్రమలో ఓ ప్రొడక్షన్ కంపెనీకి మేనేజర్ కాగా ఓ రోజు రుక్మిణి డ్రామా కంపెనీలో నటిస్తున్న బాల(వరుణ్ సందేశ్) ని చూస్తాడు. ఇలా చూడడం తోనే బాల నటనకి ఇంప్రెస్ అయ్యి బాల స్నేహితులు రంగారావు (కాశీ విశ్వనాధ్) అలాగే మొద్దు (ధనరాజ్) లతో ఓ సినిమా చేస్తానని హైదరాబాద్ రప్పిస్తాడు. అయితే ఓ రోజు ఈ ముగ్గురుని సీఐ సారంగపాణి(రవిబాబు) ఓ 90 లక్షల దొంగతనం కేసులో అరెస్ట్ చేస్తాడు. మరి ఈ కేసు నుంచి వారు బయటకి వచ్చారా లేదా? వాళ్ళు ఎందుకు ఈ కేసులో ఇరుక్కున్నారు? కావాలనే వారిని ఇరికించారా? అలాగే చిత్ర(శీతల్ భట్) పాత్ర ఏమిటి అనేది ఈ చిత్రంలో చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో గొప్పగా చెప్పుకోడానికి ఏదన్నా ఉంది అంటే అది సీనియర్ నటుడు శివాజీ రాజా ఒకరి కోసమే చెప్పొచ్చు.. తన సీనియార్టీ, నటనతో పలు సీన్స్ లో మంచి ఎమోషన్స్ తో ఆకట్టుకున్నారు. అలాగే వరుణ్ సందేశ్ సహా హీరోయిన్ కనిపించే ఒక పర్టిక్యులర్ రొమాంటిక్ ట్రాక్ మాత్రం బాగుంది. అలాగే దాని వెనుక ఉన్న చిన్నపాటి ఇంటెన్షన్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో డిజప్పాయింట్ చేసే అంశాలు మాత్రం కోకొల్లలుగా ఉంటాయని చెప్పాలి. ఈ తరహా చిత్రాల్లో కథనం ఎంత ఆసక్తిగా చూసేందుకు ఇంపుగా ఉంటేనే బాగుటుంది. కానీ అసలు అలాంటివి ఏమి ఈ చిత్రంలో కనిపించదు. అసలు కథలో ప్రధాన అంసకి వెళ్లడానికే చాలా సమయం పడుతుంది. పోనీ ఈ గ్యాప్ లో ఏమన్నా కథనం ఆసక్తిగా సాగుతుందా అంటే అదీ ఉండదు. దీంతో చాలా పేలవంగా ఈ సినిమా అనిపిస్తుంది.

ఇంకా సరే ఓ క్రైమ్ జరిగింది అక్కడ నుంచి అయినా ప్రొసీడింగ్స్ మరికాస్త మెరుగ్గా అయినా ఉండాలి. కానీ ఇందులో అది కూడా బాగా మిస్ అవుతుంది. సినిమా మొదలైన మొదటి 30 నిమిషాలు అయితే చాలా విసుగ్గా అనిపించవచ్చు. ఇంకా కొన్ని చోట్ల కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి కానీ అవి కూడా ఏమంత గొప్పగా వర్కౌట్ అవ్వవు.

అలాగే సినిమాలో సరైన ఎమోషన్స్ కూడా లేవు, నత్త నడకన చాలా నెమ్మదిగా సాగదీతగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా నటీనటుల నుంచి కూడా మరింత బెటర్ పెర్ఫామెన్స్ లు రాబట్టాల్సింది. మెయిన్ గా హీరో వరుణ్ సందేశ్ పాత్ర తేలిపోతుంది. తనతో పాటుగా ధనరాజ్, రవిబాబు పాత్రలు కూడా సోసో గానే అనిపిస్తాయి. ఇన్ని నెగిటివ్ అంశాలతో అయితే అసలు ఈ సినిమా ఎందుకు చూస్తున్నామా అని అనిపించక మానదు.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగాలేవు, ఈ మధ్య కాలంలో చాలా తక్కువ క్వాలిటీలో వచ్చిన సినిమా ఇదే కావచ్చు. అలాగే సాంకేతిక నిపుణుల్లో ఒక్క జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫీ పర్వాలేదు కానీ రధన్ మ్యూజిక్ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ఎడిటింగ్ బాగాలేదు, చాలా వరకు సాగదీత సన్నివేశాలు ఎడిటర్ కట్ చేయాల్సింది. ఇక దర్శకుడు ఆర్ ఎన్ హర్షవర్ధన్ విషయానికి వస్తే ఈ సినిమాకి తాను డిజప్పాయింట్ వర్క్ అందించారు. అసలు ఏ కోణంలో కూడా సినిమా మెప్పించదు. సరైన కథ లేదు, కథనం లేదు, ఒక బోరింగ్ సినిమాని ఓటిటిలో అందించారు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “చిత్రం చూడర” ని చూడకుండా ఉంటేనే బెటర్ అని చెప్పాలి. ఎక్కడో నటీనటుల ఓకే అనిపిస్తారు తప్ప పూర్తిగా దర్శకుని వైఫల్యం సినిమాని ఒక బోరింగ్ అంశంగా మార్చివేసింది. ఏమాత్రం ఆకట్టుకోని కథా, కథనాలు వీక్షకుణ్ణి నీరుగారుస్తాయి. సో వీటితో ఈ చిత్రం జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది.

123telugu.com Rating: 1.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు