బాక్సర్ గా మెగాహీరో, క్రేజీ మూవీ ప్రకటించారు.

Published on Oct 10, 2019 11:15 am IST

మెగా హీరో వరుణ్ తేజ్ ఓ క్రేజీ మూవీ కి సిద్ధమవుతున్నారు. మెగా హీరోలలో ప్రయోగాలు చేసే హీరోగా పేరున్న వరుణ్ మరో ప్రయోగాత్మక చిత్రానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న 10వ చిత్రం నేడు ప్రకటించడంతో పాటు, ఆ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నట్లు హింట్ ఇచ్చారు. రెడ్ బాక్సింగ్ గ్లోవ్స్ తో బాక్సింగ్ పంచ్ ఫోటోతో కూడిన అనౌన్స్మెంట్ పోస్టర్ ని హీరో వరుణ్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

రినైజన్స్ సినిమాస్, బీడబ్ల్యూసీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై అల్లు అరవింద్ సమర్పణలో ఈ మూవీ తెరకెక్కనుంది. సిద్ధూ ముద్దా, అల్లు వెంకటేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకుడు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి మొదలుకానుంది.

సంబంధిత సమాచారం :

X
More