రెండు విభిన్న పాత్రల్లో మెగా హీరో !

సాగర్ చంద్ర దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించబోతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. ఉగాది పండగ రోజున ఈ సినిమాను అధికారికంగా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.

అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు, వంటి విభిన్నమైన సినిమాలు తీసిన సాగర్ చంద్ర వరుణ్ తేజ్ ను డిఫరెంట్ లుక్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ తో పాటు వరుణ్ తేజ్ సంకల్ప్రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. అలాగే దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ సినిమాలో వరుణ్ తేజ్ నటించబోతున్నాడు.