ఆగస్టు లో వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం !

Published on May 8, 2019 9:15 am IST

మెగా హీరో వరుణ తేజ్నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం కోసం కాలిఫోర్నియా వెళ్లి బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. ఇక ఈ చిత్రం ఆగస్టు నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. హైదరాబాద్ , వైజాగ్ , ఢిల్లీ మొదలుగు ప్రదేశాల్లో మేజర్ పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నారు. ఈ చిత్రంలో తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న వాల్మీకి చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు వరుణ్. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగర్ తండా కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై లో షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది.

సంబంధిత సమాచారం :

More