వరుణ్ తేజ్ కొత్త సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ !
Published on Dec 4, 2017 10:11 am IST

ఇటీవలే ‘ఫిదా’ సినిమాతో సూపర్ హిట్ అందుకుని కెరీర్లోనే అత్యధిక వసూళ్లను నమోదుచేసుకున్న మెగాహీరో వరుణ్ తేజ్ తన తర్వాతి చిత్రం కూడా ‘ఫిదా’ బాటలోనే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండాలని నూతన దర్శకుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క టైటిల్ పోస్టర్ ను ఈరోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నారు. మొదటి నుండి ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం ‘తొలిప్రేమ’ టైటిల్ ప్రస్తావనలో ఉండగా మేకర్స్ దాన్నే ఫైనల్ చేస్తారా లేకపోతే వేరే ఏదైనా టైటిల్ ను సెట్ చేస్తారా అనేది చూడాలి. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 
Like us on Facebook