ఇంటర్వ్యూ : వరుణ్ తేజ్ – అంతరిక్షం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది !

ఇంటర్వ్యూ : వరుణ్ తేజ్ – అంతరిక్షం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది !

Published on Dec 20, 2018 2:58 PM IST

తొలిప్రేమ తరువాత మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’ . ఈ చిత్రం రేపు విడుదలవుతున్న సందర్భంగా వరుణ్ మీడియాతో మాట్లాడారు ఆ విశేషా లు మీ కోసం..

ఈచిత్రం దేని గురించి వుండనుంది ?

అంతరిక్షం ఒక వ్యోమగామి కథ. కథగా సినిమా చాలా బాగున్నా దానికి స్పేస్ బ్యాక్ డ్రాప్ జోడించడం ఈ సినిమా లో మెయిన్ హైలైట్. సెకండ్ హాఫ్ అంత స్పేస్ నేపథ్యంలోనే ఉండి ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. సంకల్ప్ రెడ్డి ప్రతి షాట్ ను ఉన్నతంగా మంచి విజువల్స్ తో తెరకెక్కించాడు.

సినిమాలో మీ పాత్ర గురించి ?

దర్శకుడు సంకల్ప్ రెడ్డి రియల్ ఇన్సిడెంట్ ని ఇన్స్ స్పిరేషన్ గా తీసుకుని హీరో పాత్ర సృష్టించారు. ఇందులో నేను దేవ్ అనే పాత్రలో నటించాను. దేశానికి గొప్ప పేరు తీసుకురావాలనే అతని కల ఎలా నెరవేరింది. అందుకు హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనేదే సినిమా కథ.

సినిమా కు మంచి హైప్ వచ్చింది కదా అంచనాలను అందుకుంటుందా ?

సినిమా చుసిన ప్రేక్షకుడికి ఈచిత్రం తప్పకుండ విజువల్ వండర్ అనిపిస్తుంది. తెలుగులో వస్తున్నమొదటి స్పేస్ థ్రిల్లర్ సినిమా కాబట్టి సహజంగానే సినిమా పై అంచనాలు ఉంటాయి అలాగే ఈచిత్రం ఎక్కడ నిరాశకు గురిచేయదు.

ఈ సినిమా చేయడానికి ఎవరినైనా రిఫరెన్స్ గా తీసుకున్నారా ? 

లేదు . తొలిప్రేమ షూటింగ్ టైం లో సంకల్ప్ ఈ అంతరిక్షం కథ చెప్పాడు. స్టోరీ వినగానే చాలా ఎక్జయిట్ అయ్యాను. వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.ఎలా చేయాలని ఆలోచించాను.కొన్ని హాలీవుడ్ సినిమాలు చూశాను. అంతే కాని ఈ సినిమా చేయడానికి నాకెలాంటి రిఫరెన్స్ లు లేవు. ఉన్న తక్కువ రిసోర్స్ లతో సినిమా చేశాను.

మాస్ ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారనుకుంటున్నారు ?

ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది, పోస్టర్లు , ట్రైలర్ చూసి సినిమాకు వెళ్లాలా వద్దని ఆలోచిస్తున్నారు. నేను ఈ చిత్రం తప్పకుండా వారికి మంచి అనుభూతిని ఇస్తుంది అనుకుంటున్నాను. క్లాస్ &మాస్ అనే తేడాలేకుండా ఈ చిత్రం అన్నివర్గాల వారిని అలరిస్తుంది.

ఎఫ్ 2 గురించి ?

ఎఫ్ 2 పక్కా కామెడీ ఎంటర్టైనర్. ఈసినిమాకు వెంకీ సర్ తో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఖచ్చితంగా ఈ చిత్రం మంచి విజయం సాదిస్తుందని నమ్ముతున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు