వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘తొలిప్రేమ’ విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ స్పందన తెచ్చుకుని హిట్ దిశగా సాగిపోతోంది. సినిమా సినిమాకు మధ్యన వరుణ్ తేజ్ చూపిస్తున్న కథలోని భిన్నత్వం, నటనలో పరిణితి ప్రేక్షకుల్ని, మెగా అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యూఎస్లో ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్కును వేగంగా అందుకుంది.
గురువారం ప్రీమియర్ల ద్వారా 1.52 లక్షల డాలర్లు, శుక్రవారం 1.39 లక్షల డాలర్లను రాబట్టిన ఈ సినిమా శనివారం 2.08 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకుని 5 లక్షల డాలర్లను నమోదుచేసింది. సినిమాకున్న పాజిటివ్ టాక్ ను చూస్తే ఇంకొద్దిరోజుల్లోనే మిలియన్ మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వరుణ్ తేజ్ గత చిత్రం ‘ఫిదా’ ఫుల్ రన్లో 2.03 మిలియన్ ను వసూలు చేసిన సంగతి తెలిసిందే.


