ఫిబ్రవరి 17 నుండి వరుణ్ తేజ్.. !

Published on Jan 21, 2020 2:46 pm IST

వరుస విజయాలతో దూసుకుపోతున్న మెగా హీరో వరుణ్ తేజ్ తర్వాతి సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ఫిబ్రవరి 17 నుండి వైజాగ్‌లో ప్రారంభమవ్వనుంది. ఇక ఈ చిత్రంలో సునీల్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు.

కాగా వరుణ్ తేజ్ గత సినిమాలు ‘ఎఫ్ 2, గద్దలకొండ గణేష’ చిత్రాలు మంచి విజయాలుగా నిలవడంతో ఇప్పుడు చేస్తున్న సినిమాకు బిజినెస్ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు సినిమాపై పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని అల్లు బాబీ, సిద్ధు ముద్దా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ లార్నెల్ స్టోవాల్ ఈ చిత్రానికి స్టంట్స్ కంపోజ్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More