‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్ చేసిన శేఖర్ కమ్ముల..!

‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్ చేసిన శేఖర్ కమ్ముల..!

Published on Oct 19, 2021 7:17 PM IST


కౌసల్య కృష్ణమూర్తి, పడేసావే, ఆపరేషన్‌గోల్డ్‌ ఫిష్‌ చిత్రాలతో కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌రాజు హీరోగా, మిస్తి చక్రవర్తి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’. తేజస్వి క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై సందీప్‌ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల విడుదల చేశారు.

ఈ సందర్భంగా శేఖర్‌కమ్ముల మాట్లాడుతూ కార్తీక్‌రాజు నటించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ ఇంప్రెసివ్‌గా ఉందని, ఈ చిత్రం విజయం సాధించి అందరికి మంచి పేరును తీసుకరావాలని ఆశిస్తున్నానని అన్నారు. దర్శక నిర్మాత సందీప్‌ గోపిశెట్టి మాట్లాడుతూ ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల గారితో మా ఫస్ట్‌లుక్‌ విడుదల కావడం సంతోషంగా ఉందని, ఇది మా విజయానికి శ్రీకారంలా భావిస్తున్నామని అన్నారు. ఈ సినిమా పూర్తి కమర్షియల్‌ అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ అని, తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని అన్నారు. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రశాంత్‌, భీమనేని శ్రీనివాస్‌, దేవి ప్రసాద్‌, పోసాని కృష్ణమురళి, ఆమని, గణపతి, అన్వి, డా.శేషసాయి తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు