ఈ ముగ్గురు హీరోలు తమ సినిమా పై అంచనాలు పెంచేస్తున్నారు !

ఈ ముగ్గురు హీరోలు తమ సినిమా పై అంచనాలు పెంచేస్తున్నారు !

Published on Aug 7, 2018 12:55 AM IST

Veera Bhoga Vasantha Rayalu1
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణుల కాంబినేషన్ లో నూతన దర్శకుడు ఇంద్రసేనా దర్శకత్వంలో ‘వీర‌భోగ వ‌సంత‌రాయులు’ చిత్రం తెర‌కెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వీరితో పాటు సీనియర్ హీరోయిన్ శ్రీయా కూడా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఓ వైవిధ్యమైన కథతో ఓ సైంటిఫిక్ సినిమాగా తెరకెక్కతుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో చాలా భాగం సోషియో ఫాంట‌సీ నేపథ్యంలో సాగుతుందట. ఆ మధ్య విడుదలైన నారా రోహిత్ లుక్ తో పాటుగా ఇటీవలే విడుదలైన సుధీర్ బాబు లుక్ కూడా బాగుండటంతో ఈ సినిమా పై ఒక్కసారిగా నెటిజన్లలో ఆసక్తి పెరిగింది.

ఇక శ్రీ‌విష్ణు ఈ చిత్రంలో గ్రహాంత‌ర వాసిగా కనిపించనున్నాడట. దుష్ట శిక్షణ చేయడానికి దేవుడు అవతారాలు ఎత్తుతాడని పురాణాల్లో ఇతిహాసాల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ కథాంశం ఆధారంగానే ఈ చిత్రం రూపొందుతుంది. మొత్తం మీద ఈ ముగ్గురు హీరోలు కలిసి తమ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నారు. ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా బాబా క్రియేష‌న్స్ ప‌తాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు