బుల్లెట్ బాబుగా వెంకీ కొత్త లుక్ అదిరింది

Published on Aug 3, 2019 2:32 pm IST

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న “వెంకీ మామ” చిత్రంపై భారీ అంచనాలున్నాయి. కొద్దిరోజులలో ఈ చిత్ర టీజర్ ని విడుదల చేయనున్నారు. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తుండగా దర్శకుడు బాబీ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. కాగా ఈ చిత్రంలోని వెంకీ లుక్ ఒకటి ఫ్యాన్స్ విడుదల చేశారు.

ఆర్మీ గ్రీన్ బులెట్ పై కూర్చొని మీసం మెలితిప్పుతున్న వెంకీ మాస్ లుక్ ఆసక్తికరంగా ఉంది.ఆ ఫొటోలో చుట్టూ పొలాల మధ్య వెంకటేష్ ని చూస్తుంటే కోనసీమ బులెట్ బాబులా వెంకీ ఈ చిత్రంలో ఇరగదీస్తాడనిపిస్తుంది. వెంకీ మామ పక్కా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందేమో అన్న భావన వెంకటేష్ లేటెస్ట్ లుక్ చుస్తే అర్థం అవుతుంది. ఏదేమైనా ఈ ఒక్క లుక్ తోనే వెంకీ సినిమాకి మంచి ప్రచారం కల్పించారు.

సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :