‘నారప్ప’ కోసం సర్వం ఒడ్డుతున్న వెంకటేష్

Published on Feb 22, 2020 1:07 am IST

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘నారప్ప’. తమిళ హిట్ మూవీ ‘అసురన్’కు ఇది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో ఈ రీమేక్ రూపొందుతోంది. ఒరిజినల్ వెర్షన్ కు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, ఫైట్స్ విషయంలో పర్ఫెక్షన్ ఉండేలా చూసుకుంటున్నారు. ప్రతి షాట్ ఖచ్చితంగా ఉండటం కోసం ఎన్ని టేక్స్ అయినా చేస్తున్నారట వెంకీ.

ఇకపోతే సినిమాకే కీలకమైన ఇంటెర్వెల్ ఫైట్ కోసం ఏకంగా 10 రోజులు షూటింగ్ జరిపారట. ఈ పోరాట సన్నివేశాన్ని ప్రముఖ స్టంట్ కొరియోగ్రఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో తమిళనాడులోని 12000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రెడ్ డెసర్ట్ అనే ప్రాంతంలో ఈ ఫైట్ కంపోజ్ చేశారు. ఇందులో వెంకటేష్ సతీమణిగా ప్రముఖ నటి ప్రియమణి నటిస్తుండగా రెండవ హీరోయిన్ పాత్రలో మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ కనిపించనుంది. ఈ చిత్రాన్ని సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More