కొనసాగుతున్న నారప్ప మేనియా…వెంకిమామా కోసం వెయిటింగ్!

Published on Jul 19, 2021 8:18 pm IST

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రం లో వెంకటేష్ చాలా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదల అయి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే అన్ని ప్లాట్ ఫామ్ లలో కలిపి ఈ ట్రైలర్ 25 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం నేడు అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ విడియో లో స్ట్రీమ్ కానుంది.

అయితే ఈ చిత్రం లో వెంకటేష్ నటన మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అనేలా ట్రైలర్ లో కనిపిస్తూ ఉండటం తో వెంకీ మామ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో సర్వత్రా నారప్ప చిత్రం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ చిత్రానికి సంబంధించిన ట్యాగ్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ చిత్రం లో వెంకటేష్ సరసన హీరోయిన్ గా ప్రియమణి నటించగా, ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం అందించడం తో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :