సరికొత్త రోల్స్ కి శ్రీకారం చుడుతున్న వెంకటేష్

సరికొత్త రోల్స్ కి శ్రీకారం చుడుతున్న వెంకటేష్

Published on Oct 28, 2014 8:24 AM IST

venkatesh
గత 25 ఏళ్ళుగా తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా వెలుగొందుతున్న విక్టరీ వెంకటేష్ ఇప్పుడు తన కెరీర్లో కొన్ని ఆసక్తికరమైన మరియు సరికొత్త పాత్రలకి శ్రీకారం చుడుతున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న పాత్రలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సరికొత్త పాత్రలు చేస్తున్న వెంకటేష్ కి ఆ పాత్రలు మరింత మంచి పేరు తీసుకు రావడమే కాకుండా కెరీర్ కి మంచి బూస్ట్ ఇస్తున్నాయి.

వెంకటేష్ ప్రస్తుతం ‘ఓ మై గాడ్’ రీమేక్ అయిన ‘గోపాల గోపాల’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ సరికొత్త పాత్రలు మరియు ఫ్రెష్ స్క్రిప్ట్స్ తో మన ముందుకు రానున్నాడు. ఈ సినిమాల గురించి త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు. రానున్న 4 సంవత్సరాలు ఇలాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని వారి నుంచి ప్రశంశలు అందుకోనున్నాడు.

తాజా వార్తలు