దశరథ్ దర్శకత్వంలో వెంకటేష్.?

దశరథ్ దర్శకత్వంలో వెంకటేష్.?

Published on Oct 16, 2014 9:03 AM IST

venkatesh-dasharath

కుటుంబ కథా చిత్రాలు చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్న హీరో విక్టరీ వెంకటేష్. ఇప్పటి వరకూ వెంకటేష్ అన్ని జోనర్స్ లో సినిమాలు చేసినప్పటికీ ఎక్కువ శాతం మాత్రం కుటుంబ కథా చిత్రాలే చేయడం విశేషం. ఇలాంటి హీరో ‘సంతోషం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘గ్రీకు వీరుడు’ లాంటి సినిమాలతో కుటుంబ కథా చిత్రాలు చేయడంలో స్పెషలిస్ట్ అయిన దశరథ్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుంది.

మీరు వింటున్నది నిజమే.. ఇటీవలే దశరథ్ వెంకటేష్ ని కలిసి ఓ కథని చెప్పారు.. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. వెంకటేష్ ఫైనల్ కథని ఓకే చేస్తే వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇద్దరూ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన వారే కాబట్టి వీరిద్దరి నుంచి ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఆశించవచ్చు. ఈ సినిమా అధికారిక అనౌన్స్ మెంట్ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇది కాకుండా వెంకటేష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి ‘గోపాల గోపాల’ అనే మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఇది కాకుండా రవితేజ తో చేయనున్న ఓ మల్టీ స్టారర్ సినిమా కూడా చర్చల దశలో ఉంది.

తాజా వార్తలు