చివరి దశలో వెంకీ ‘నారప్ప’

Published on Jan 22, 2021 9:13 pm IST

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’కు ఇది తెలుగు రీమేక్. ఒరిజినల్ వెర్షన్లో ధనుష్ చేసిన పాత్రను తెలుగులో వెంకీ చేస్తున్నారు. లాక్ డౌన్ మూలంగా ఆగిపోయిన ఈ చిత్రం ఇటీవలే మొదలైంది. షూటింగ్ చివరి షెడ్యూల్ హైదరాబాద్లోని పలు లొకేషన్లలో జరుగుతోంది. ఇదే సినిమాకు చివరి షెడ్యూల్. ఇది పూర్తైతే సినిమా మొత్తం ముగిసినట్టే.

జనవరి నెలాఖరుకు ఈ షెడ్యూల్ ముగుస్తుంది. ప్రస్తుతం కథలోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వెంకటేష్, అమ్ము అభిరామి, నాజర్ లాంటి కీలక నటీనటులు ఈ షెడ్యూల్లో నటిస్తున్నారు. వేసవికి సినిమాను విడుదలచేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఈ సినిమా మీద వెంకీ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ చిత్రాన్ని సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో వెంకటేష్ సతీమణిగా ప్రముఖ నటి ప్రియమణి నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

More