నాగ చైతన్యని ఆకాశానికెత్తేసిన వెంకీ మామ

నాగ చైతన్యని ఆకాశానికెత్తేసిన వెంకీ మామ

Published on Dec 4, 2019 7:58 PM IST

వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి బాబీ డైరెక్షన్లో చేసిన చిత్రం ‘వెంకీ మామ’. దగ్గుబాటి, అక్కినేని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 13న విడుదలచేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ తన మేనల్లుడు చైతన్యకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు.

తనకు రానా, చైతూలతో సినిమాలు చేయాలని ఉండేదన్న వెంకీ ఈ సినిమాలో చైతూ గత సినిమాల కంటే చాలా భిన్నంగా కనిపిస్తారడని చెప్పుకొచ్చారు. ఇందులో అతని ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూడొచ్చని, పాత్రలో ఒదిగిపోయి, యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ ఇలా ప్రతి ఎమోషన్ గొప్పగా పలికించాడని, అతని వర్క్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యానని అన్నారు. అలాగే తన తండ్రి రామానాయుడుగారిని గుర్తుచేసుకుని ఆయన ఉండి ఉంటే సినిమాను తప్పక ఎంజాయ్ చేసేవారని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు